Saturday, April 3, 2021

ఈ బహుమతికి ఖర్చు ఎంత???

 


ఈ బహుమతికి ఖర్చు ఎంత???(మగవారికి, ఆడవారికి కూడా)

చెప్పే వారి మాటలపై శ్రద్ధ, ఆశక్తి కనబరుస్తు...
అన్య విషయాలలో ఆదమరువక...
పక్కనే కూర్చుని కూడా మరొలోకంలో విహరించకుండ...
వినే విషయంలో లీనం కావటానికి.... ఖర్చు ఎంత?

ఒక చిన్న అనురాగపు మాట ,
అభిమానం నిండిన ఆదరణ,
గెలుపులో ప్రశంశకి(ఆనందానికి) ... ఒటమిలో ఒదార్పుకు...
"నేనున్నాను" అనే భరొసా ఇవ్వటనికి.... ఖర్చు ఎంత?

మ్రుదుమధుర దరహసం....
వెనుతిరిగి చేసుకోవటానికి భయపెట్టని
మధురానుభూతులను జ్ఞాపకాలుగా
బహుకరించటానికి..... ఖర్చు ఎంత??

తను చేసే ప్రతి పనిలొ
తన ప్రేమని, కష్టాన్ని గుర్తించిన
అనుభూతి తెలిపే ఒక చిన్న ఆనందం... 
మనఃపూర్వకంగా ఇవ్వటానికి.... ఖర్చు ఎంత???

తనతో ఎంతసేపు గడ్దిపినా అది తక్కువే అనిపిస్తుందని...
తనతొ గడిపే కాలం మనకు ఎంతొ అమూల్యమైనది అని తెలిసేలా...
తనతొ గడ్దిపిన ఒక్క క్షణమైన సరె
తన ధ్యాసతోనె, తన కోసమె గడపటానికి.... ఖర్చు ఎంత???

మన తీరిక సమయంలో,
కనీసం
చిన్ని చిన్ని పనులలో...
మనం కూడ సహకరిస్తూ
తన బధ్యతని పంచుకొవటానికి, చేయూతనివ్వటానికి
మనం సిద్ధమే అని తెలుపటానికి... ఖర్చు ఎంత??

తనలోని మంచిని గుర్తించి గౌరవిస్తె,
తన సహకారానికి స్పందన తెలుపుతు
తన కృషికి, అశయాలకి, గెలుపుకి
"నాకు సమ్మతమే" అని భరొసా తెలుపటానికి.... ఖర్చు ఎంత???

ఒక బంధానికి నమ్మకాన్ని అందించటానికి
ఖర్చు ఎంత???
పొనీ ఆ ఖర్చువల్ల ఆ బంధం పదిలంగా ఉంటుందంటే...
లాభనష్టాల లెక్కలు వేస్తే...
ఇప్పుడు వచ్చే లాభము ఎక్కువే...
పట్టించుకోకపోతే వచ్చే నష్టము ఎక్కువే...
రెండిటికి విలువ "ఒక జీవితం"

shloka (శ్లోకా శాస్త్రి)