Thursday, February 2, 2012

"ఇమాజినేషన్"లోని సౌమ్యత "గ్రాఫిక్స్"లో ఎందుకు లోపిస్తోంది ???



                                       
సాధారణ బ్లాక్ బోర్డ్ నుంచి టెక్నో స్కూల్ వరకు ఎదగటం,చందమామ కథలనుంచి వీడియొ గ్రాఫిక్స్ వరకు ఎదగటం ఖచ్చితంగా మనం ప్రగతి సాధించాం అనే చెప్తున్నాయి..... కాని మనం ప్రగతి టేక్నోలజిలో సాధించామా లేక వివేకంలో సాధించామా???

                                     
నేటి పిల్లల మేధస్సు ఎంత వేగంగా ఉందంటే కంప్యుటర్లో లభ్యమైయ్యే టూల్స్ అన్నిటిని ఉపయోగించగలరు, వాటితో కొత్త ప్రపంచాని చూపించగలరు, ఎంతటి విచిత్రాలనైనా సాధించగలరు.నిజమే.... నేటి పిల్లల మేధాశక్తి అమోఘమైనది, కాదని కూడా అనలేము. కాని నేటి తరం పిల్లలులో ఎంతమంది బొమ్మలు లేకుండా (picturization/ visualization ) లేకుండా విషయం మాత్రమే చెప్తే అక్కడ ఎం జరిగి ఉండవచ్చు అని ఆలోచించటం మొదలుపెడ్తున్నారు??? స్మార్ట్ వర్క్ చేయటం మంచిదే కాని అసలు  మెదడుని ఉపయోగించటం అంటేనే దానిని కస్తాపెట్టటం (హార్డ్ వర్క్ ) అంటున్న మన విజ్ఞానులు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారంటే చిన్ని చిన్నిలెక్కలకి కూడా  "కంపూటర్"లో  "కాల్కులేటర్"ని  (
మామూలు కాల్కులేటర్ పాపం ఎప్పుడో అవుట్ డేటెడ్ ఫాషన్ అనిపించుకుని మూల పడిందిలెండి) వాడేస్తున్నారు. మరి ఇది "స్మార్ట్ వర్క్ " అనాలో లేక "లేజీ వర్క్" అంటారో నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థం అయితే కాస్త చెప్పుదురూ ప్లీజ్.
                                       పెద్దలు గమనించి ఉంటె (మీరంతా అనుభవజ్ఞులు కనుక తప్పక గమనించే ఉంటారులెండి) ఇంకొక విషయం.... నాటి చందమామ కథలను చదివి వారి ఊహాశక్తితో చిత్రాలను, సన్నివేశాలను, పత్రాలను అర్హ్తం చేస్కున్నవారి మానసిక స్థితులు ఎన్నడు అంత వికృతంగా ఉండేవి కాదు ఎందుకంటే వారి మనసులోని సౌమ్యత వారిని క్రూరత్వాన్ని కూడా సౌమ్యస్తిలోనే ఒక హద్దు వరకు ఊహించనిచ్చేవి, వారికి రాక్షసుడైన మనసుని వణికించే అంత భయానకం కాదు, కాని నేటి పిల్లలు చూసే monsters ని చూస్తే నిజంగా దయ్యలనేవి ఉంటె గుండె ఆగి చస్తాయి మరి అంత వికృతమైన చిత్రాలను చూస్తున్న చిన్నారుల హృదయాల పైన ప్రభావం ఉండదంటార???

                                        
ఊహలకి మనసు పైన ఎంత ప్రభావం ఉంటుందో చూసే చిత్రాలు చేసే పనులతో కూడా మనసుపైన అంతకు రెట్టింపు ప్రభావం ఉంటుందనే మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి గ్రాఫిక్స్ మనసుపైన నేరుగా ఎంత ప్రభావాన్ని చూపుతున్నాయి అంటే ముందు వచ్చిన సంత స్వరూపుడు రాముడు కంటే కూడా తర్వాత వచ్చిన గ్రాఫిక్ ఎఫ్ఫెక్ట్స్ తో కళకళలాడుతున్న శూర్పణఖ, కుంభకర్ణుడు ( వీరు మన కథలోలా మనవ తలకాయలతో కాదులెండి ఒక రేంజ్ కోరివిదయ్యలకే కోరివిదయ్యలులా ఉంటారుమనసులో తిష్ట వేసుకుని కూర్చుంటారు, వారు చేసేవి వీరికి ప్రతి సన్నివేసం ఒక సాహసంలా ఉంటుంది (యాక్షన్ కింగ్స్ వాలు వీరికి ). ప్రభావాలకి రుజువు నేటి పిల్లల విపరీత ధోరణి, వయసుకు మించిన మాటలు, వయసుకు తగని చేతలు, మానసిక వికృత/వికార చేష్టలునేను పైన కేవలం రామాయణాని మాత్రమే ఉదహరించాను కాని అంత కన్నా భయనకంవి ఎన్నో నేను మార్కెట్లో విడుదల అవుతునాయి. వాటి ప్రభావం ఎంతవరకు వారి పిల్లల పైన చూపిస్తోందో ఎవరికి వారే ఆలోచించుకోవాలి . నాటి సౌమ్యత నేటి పిల్లలలో ఎందుకు కనిపించటంలేదు అని ఒక్కసారి మీరే గమనించండి మీ చిన్నారులలో వస్తున్న మార్పుని. వారి మనసులోని "హిడెన్ సైడ్"లో ఏముంది అని గమనిస్తున్నామ మనం.

                                      
నాటి వారిలో ప్రతి సమస్యని ఎదుర్కునే మానసిక స్థైర్యం, సమస్యకి పరిష్కారం ఆలోచించే మానసిక వికాసం ఉన్నాయి, మరి నేటి విగ్ననులకి వివేకం హెచ్చుగానే ఉంది కదా మరి సమస్య వస్తే క్రున్గిపోవటం ఎందుకు తరచు కనిపిస్తుంది, సమస్యకి పరిష్కారం ఆలోచించే అంత ప్రశాంతత మనసులో ఎందుకు ఉండటంలేదు.లోపం ఎక్కడ ఉంది. నాటి విజ్ఞానం పరిష్కారం దొరకకపోతే పెద్దలను సంప్రదించమని ప్రత్సాహిస్తుంది మరి నేటి విజ్ఞానం (5 ఏళ్ళ  పిల్లడు కూడా) పెద్దలు వారే ముందుకు వచ్చి సలహా చెప్తే "నీకేం తెలియదు, నువ్వు ఊరుకో" అని కొట్టి పారేయటాన్ని పెంపొందిస్తోంది ఎందుకు? మరి పిల్లలిన ముందు తరం పెద్దలకంటే అభివృద్ధి చెందినవారే  కద (తరం తరం మద్య అంతరంలో ఒక కొత్తదనం ఖచ్చితంగా ఉంటుంది). మరి నేటి విజ్ఞానం, వివేకం ప్రతి సమస్యకి తాడో - పేడో అంటూ extreams కే ఎందుకు  తీసునివెళ్తోంది.

                                            
మనం టేక్నోలోజిలో ప్రగతి సాధిస్తున్నాం కాదనేది లేదు కాని విజ్ఞానం, వివేకంలో మాత్రం వైఫల్యం అవ్తున్నాం. విజ్ఞానం అంటే కేవలం పుస్తకాలలోని విద్య మాత్రమే కాదు, సామాజిక చైతన్యం అని నేటి పిల్లలకి తెలుపలేకపోయాము, పిల్లలో వచ్చే వయసుని మించిన ప్రవర్తనని ముందే గమనించలేక పోయాము. ప్రత్యేక గదులు, ప్రైవసీ సమయాలు అంటున్నాము బాగానే ఉంది కాని ప్రత్యేక గదులలో వారు ఏమి చేస్తున్నారో మనం గమనిస్తున్నమా??? ప్రైవసీ కావాలి కాని మనం పరయి తత్వాన్ని పెంచే ప్రైవసీ ఇస్తున్నాము (పిల్లలని ఒక వయసు వరకు ప్రైవసీ , సీక్రసి వంటి పదాల నుంచి వారే తప్పొప్పుల తేడా తెలుసుకునే వరకు దూరంగా ఉంచటం తప్పు కాదు).

No comments:

Post a Comment