Friday, February 3, 2012

కల కంట కన్నీరు



                                                    "కల కంట కన్నీరు ఒలికిన కొడిగట్టు సిరులు" అంటారు. మరి ఐదు నిమిషాలకి ఒకసారి ఏదో ఒక మాటలతో మనసుని గుచ్చుతు, వేధిస్తూ ఉంటె కన్నీరు రాక మరి ఏమి వస్తుందట? అందున పెళ్లి ఐన తర్వాత మరీ.... రెండు భిన మనస్తత్వం ఉన్న పుట్టినింటిని మేట్టినింటిని compromise చేయలేక, వారి నడుమ తాను వంతెనగా ఉండటానికి పడే యాతన, ఆ ప్రయత్నంలో నలిగిపోతున్న, ఆ పద్మవ్యూహంలో చిక్కుని కుమిలిపోతున్న, కొవ్వొత్తిలా కరిగిపోతు కూడా తన ప్రేమ అనే వెలుగు ఒకవైపు పంచుతునే మరోవైపు కూడా ప్రసరిస్తోంది అని తెలుపలేక అల్లాడిపోతున్న హృదయం పడే వేదనకి కన్నీరే ఓదార్పు మరి ఆ కాసింత ఓదార్పు కూడా లేకుండా ఈ ఫిట్టింగ్ పెట్టి మనసుని fry చేసుకుని మరి తింటున్నారే ఇది ఏమైనా భావ్యమా (already మెదడుని తినేసి కూడా నిందలు వేస్తున్నారు మేము వచ్చి (లేని) మీ మెదడుని తింటునాము అని)మరి మీ ఇంటి సిరులు మా కనీటి వల్ల కరిగిపోతాయి అనుకుంటే మరి మమ్మల్ని కూడా కాస్త మనస్శంతిగా  ఉండనివ్వోచు కదా..... బాధ లేకుండా కన్నీరు పెట్టుకోవటానికి ఏ కంటికి సరదా.... ఏ మనసు మాత్రం తనను తాను భారం చేసుకోవాలి అనుకుంటుంది.... కన్నీరు చిందించే వారు లేకుంటే? కష్టపెట్టేవారు లేకుంటే ఈ కన్నీరు బాధను పలుకదు (ఆనందభాష్పాలు కూడా ఉన్నాయి కద కన్నీరులానే)

గమనిక:
కొంతమంది ఉంటారులే ఆడది ఏడుస్తుంటే వారికి వెయ్యి ఏనుగులను గెలిచినంత లేదా ప్రపంచాన్ని గెలిచినంత సంబరం.... అలంటి వారికి  మనం ఏడ్చి గీ పెట్టుకున్నఅర్థం కాదు మేము ప్రేమిస్తున్నాము అంటూనే ఆ (అతి విచిత్ర ) ప్రేమతో ప్రాణాలు తోడేస్తుంటారు కద వారు కనీసం అర్థం చేసుకోవచ్చు మనసు పెట్టి ఆలోచిస్తే అని మా బాధ/ప్రయాస

3 comments:

  1. simple gaa chaala baaga chepparu aadavari badha, kanneeti vedana.

    ReplyDelete
  2. "బాధ లేకుండా కన్నీరు పెట్టుకోవటానికి ఏ కంటికి సరదా...." అవును ఏ కంటికి మాత్రం కాటుకని చెరిపేసి కన్నీటికుండ కావాలనుకుంటుంది? మీరన్నట్టు కొంతమందికి అవతలివారి కళ్ళలో నీరుచూడ్డం ఓ హాబీ. అది మానసిక జాడ్యం--అది మనుషులలోని ఒక జాతికే కాకుండ అందరికీ ఉంది దుదృష్టవశాత్తూ...మీ రచన బావుంది

    ReplyDelete