Saturday, November 16, 2013

SAVE CHILDHOOD


మరో సారి ప్రేమ పడగలు విప్పి బుసలు కొట్తే వేళ, 
అనురాగం ముసుగులో కోరిక కాటేసి కసిగా నవ్వే వేళ,
ఒక మృగం నిదురిస్తున్న మృగాలని దాటుకుంటూ....
పసితనపు నిర్మలత్వం యొక్క అస్తిత్వానికి పరిక్ష పెట్టాలని చూస్తుంది! 

తన పైశాచికత్వానికి పరకాష్టగా...
భగ భగ మండే కోరికల కొరివిని మెడలో వెసుకుని
తాండవం చేస్తూ... 
నిశాచర నిరంకుశ "నిషా"ని మనసులొ నింపుకుని
విషపు వాసనలు చిమ్ముతూ వెక్కిరిస్తుంది!!!
 
బల్యపు చిగురులైనా వాడని 
అమయకపు అందాలని, ఆనందాలని...
జీవితపు తప్పటడుగులైనా పూర్తవని పసితనాన్ని... 
నిర్మొహమాటంగా తన ఇనుపహస్తాలతో నలిపేసేందుకు వస్తోంది!!! 

తన రాకాసి గోర్ల రాక్షసత్వానికి 
నెత్తురోడుతున్న పసితనపు తోలును 
ఒక్క చూపు చూసి... 
"మళ్ళి వస్తా, యెక్కడ దాక్కుంటావొ దాక్కో" అని హెచ్చరించి,
తన పైసాచిక రాజ్యాన్ని ఏలుకొవటానికి  
వికటాట్టహాసం చెసుకుంటూ వెళ్తోంది!!! 

చీకటిలోని దాపరికం 
తనని మాత్రం రక్షించటంలేదెందుకో  
తెలియని పసితనం 
కన్నీటి కడలిలో జీవితం తట్టుకోలేక 
లోకం వదలి చేరలేని లొకాలలో దాక్కుందాం అనుకుంటుండగా...
మనసు మూలగడం ఆపి,
అద్రుష్టం కొద్ది యెదురు ప్రస్నలు మొదలు పెట్టింది...

"ఎన్నాళ్ళు దాక్కుంటావ్???? ఎన్నెళ్ళు దాచిపెడ్తావ్????
ఎవరు మాత్రం ఎంతకాలం రక్షిస్తారు???? 
ఏ చీకటైనా నిన్ను దాచగలదెమో కానీ... 
నీ రక్తాక్షరాలను, కన్నీటి అలలను దాచగలదా లోకం నుండి????
తను మాత్రం చెప్పగలదా లోకనికి నీ గాయల మాటున జ్వాలని అర్థమయ్యేలా???? 

దాక్కొని ఎమి చేస్తావు?
ఎదిరించలేనంతవరకు 
ఈ కన్నీరు నిన్ను ఎక్కడా ఎదగనివ్వదు, 
నిన్నుగా బ్రతకనివ్వదు!!! 

ముందు ఎదురించు!!!
ఇక ఈ కామంధపు బంధనానికి కాలం చెల్లింది!!! 
ఈ కన్నీటి సుడిగుండంలో 
నిత్యం నిశబ్ధంగా రోధించే శక్తి నాలో నశించింది!!! 

చీకటి మాటున రాత్రిళ్ళు నేనిక ఓర్వలేను,
ఈ డేగ రెక్కల చప్పుళ్ళకి (నిశబ్దానికి కూడా) జడిసే 
పిరికితనం నేనిక పులుముకోలేను!!! 

వెలుగు ఆపేసే చీకటి నీడలు అలసిపొయాయి, 
లే. పైశాచిక ఆనందాన్నికి రెచ్చిపొయే అవకశాన్ని 
అణగదొక్కే అగ్నిగుండమై లే" అంటూ అరుస్తోంది!!! 

నెత్తురోడుతున్న జ్ఞాపకాలని కాదు, 
నెత్తురు చిందిస్తున్న నిబ్బరాన్ని చూడు!
నీ శక్తిని హరిస్తున్న నిస్తేజానికి నీవే చితి పెట్టు!

నీ మనసుని కాల్చేస్తున్న మ్ర్గం కొరికల కాష్టానికి
ఎదురుతిరిగి ఇక స్వస్తి చెప్పు పద!  

నీ చిన్ని చిన్ని ఆనందాలకి మురిసే, 
అమూల్య సంతోషాన్ని,
నీ మనసు స్వచ్ఛతని దూరం చేసిన రాబందుకు 
నీ అడుగులే గుండెల్లొ అలజడి రేపే 
బలమైన తూటాల్ల వినిపించాలి. పరుగిడు....

చేజారిన కాలాన్ని సరికొత్తగా మొదలెట్టు.
ఆలోచించు......

మరలా నీ శక్తిని కర్కశ శూలానికి 
బలి కాకుండ కాపాడుకునేలా అడుగులు సారించు 
లే... అంటూ 
గాయల నుండి గమ్యం తలుపులు తెరిచేందుకు ఉసిగొలుపుతోంది 

SAVE CHILDHOOD. PROTECT CHILDREN FROM CHILD ABUSE.


బాల్యం చేజారితే తిరిగి పొందటం ఎంతో కష్టం. అది ముఖ్యంగా చీకటి మాటున గాయలవల్ల ఐయ్తే ఆ గాయం చేసె పరిణామం భయంకరం.

70% భాదితుల్లొ భాదించేవారు సన్నిహితులో బంధువులో కావటం శోచనీయం.

ఆ నిర్మల బాల్యాన్ని బలి కాకుండా కపాడాల్సిన బధ్యత మనిషినని చెప్పుకునే ప్రతి ప్రాణికి ఉంది 

EVERY CHILD HAS RIGHT TO FILL THEIR CHILDHOOD WITH BEAUTIFUL MEMORIES. DON'T DESTROY THEIR DREAMS IF U R A HU"MAN".

  


No comments:

Post a Comment