Friday, September 27, 2013

భూమికి గ్రహణం పడ్తోంది



ఆకాశపు తీగలమీద సూర్యుడు నిప్పులారేసుకుంటుంటే వాటి కొస చుక్కలు  పాపం ధరణిని చేరి మండిస్తున్నాయి.

ధరణి ఒక్కసారి చూసి నిస్తేజంగా నవ్వుకుని "నా గుండెల్లో పెరిగిన వారే నీనుంచి నాకున్న రక్షణ వలయాన్ని(ఓజోన్ పొర) చేరిపెస్తుంటే ఆ బాధకన్నా ఈ మంటలు ఎక్కువ కాదులే " అంటుంటే సూర్యుడు జాలిగా
 చూసాడు. 

సూర్యుడు మాత్రం ఆ ధవళ వస్త్రాలని ఆరవేయకుండా ఎం చేస్తాడు. ధరణి పుత్రులే  
వారి ఇద్దరి మధ్య పెట్టిన పొరల తీరాన్ని కాల్చేస్తుంటే నిస్సహాయంగా చూడటం తప్ప ఎం చేయగలడు.

భూమికి పడ్తున్న విడిపించలేని, విడిపోని గ్రహణాన్ని చూస్తూ మాత్రం 
ఏమి చేయగలడు జాలి పడటం తప్ప !!!!!

కానీ ధరణికి అంత కంటే చిత్రం అనిపించిది ఏమిటంటే, తన బిడ్డలే తనని ఈ నిప్పులకింద పెట్టి ఆనందిస్తున్నారు.
 ఆ నిప్పుల నీడలు తనకి గ్రహణమౌతుంటే గుర్తిన్చనంతగా మనసు మూసుకుని కళ్ళు అప్పగించి ఆనందిస్తున్నారు.
కాని ఆ గ్రహణం తనకంటే ముందు వారినే కబళిస్తుందని గ్రహించేదెప్పుడో అర్థం కాక ఆలోచిస్తుంది. 

అవను మనిషే భూమికి గ్రహణం అవ్తుంటే వేరే గ్రహాలూ ఏమి చేయగలవు?
 మరచి ప్రకృతి వలువలు వలిచే  నిలువెల్లా నిండిన మనిషి  రాహువైనప్పుడు!!!!

కండకావరంతో ధరణిని వివస్త్రని చేసి, ఆ నగ్న మేని పైన తన సామ్రాజ్యాన్ని  నిర్మించుకుని 
ఆణువణువూ స్వ్వార్థం నిండిన నాగరిక దానవుడు కేతువైనప్పుడు !!!!

తన  బిడ్డలనుకుని గుండెలపై మోస్తూ 
అపురూపంగా నిర్మించుకున్న తన ప్రకృతి రాజ్యాన్నే 
అందమైన బడిగా, పొదరిల్లుగా ఓలలాడించిన భూమికి 
ఈ మనవాపురమైన దానవ చేష్టలతో గ్రహణం పట్టకుండా ఏమవుతుంది..... 


నింగికి  ఎగరాలనుకున్నాడు 
కానీ దానికి నేలని నిప్పుల జిమ్మె రాకెట్లతో తన్ని వెళ్తున్నాడు. 

భూమిని మొత్తంగా ఒక్కసారే చూసేయ్యాలనుకున్నాడు
చూసినది  సరిపోలేదేమో 
అతి నీల లోహిత  ఓజోన్ పొరకి చిల్లులు పెట్టి ఆనందిస్తున్నాడు 

సాటిలైట్ ఛానళ్ళలో  వీక్షిస్తూ 
తను ఎంతగా ఇంకా భూమిని నగ్నం చేయొచ్చో లెక్కలేస్తున్నాడు 

 అణుఅస్త్రాలతో తన రాజ్యాన్ని స్థాపిసున్నా అనుకుంటూనే సకల ప్రాణులకి 
 సరిపడా స్మశానాన్ని నిర్మిస్తున్న మూర్ఖులవల్ల గ్రహణమే కదా పట్టేది. 

నేటి మానవుడు ప్రకృతికి ఎదురు పోరాడి గెలిచాం అనుకుంటున్నాడు 
నిజంగా గెలిచాడ?????
ఏమో... ఒకింత  నిజమేనేమో 
ఒకింత నిజమనిపించే!!!!!!
నిర్దయ నిండి కబళించేందుకు సిద్దంగా ఉన్న 
మాయ జూదం ఏమో  

పుట్టిన క్షణం నుంచి మరణం వరకు అంతా 
యంత్రాలపైన నడిపిస్తూ…..
తను  తయారు చేసిన చిచ్చులో(తో) తనే
 అతితేలివితో 
గెలిచిన చోటే ఓడిపోతున్నా
గుర్తించలేని అంధకారంలొ కొటుమిట్టాడుతున్నాడు 

క్షణమైనా విరామమివ్వకుండా 
ప్రకృతిని  ప్రతి క్షణం మనసారా మధించేస్తు!!!!! 
తనని తాను దహించేసుకుంటున్నది కూడా మర్చిపోతు!!!!!
ఆనందిస్తున్న ఈ జీవోత్తముడిది 
మూర్ఖత్వమ లేక  పైశాచికత్వమా????? 

తను కూర్చున్న కొమ్మ నరికేస్తున్నా తెలుసుకోలేని వాడు,
తానే నరికెసుకుంటున్నా గుర్తించలేనివాడు మూర్ఖుడు 
తనతోపాటు పక్కనోడు ఉన్నాడు అని గుర్తించక,
గుర్తించికూడా అలోచించక 
ఇద్దరినీ కలిపి ముంచేసేవాడు ఎవరు ????

తన కొమ్మ విరిగిపోతుంది
 అని తెలిసీ ఆపకుండా
“ఆ కట్ట్లేలతోనే దీపం పెట్టుకుంటాను” అనుకుంటున్నవాడు 
సామాన్య పౌరుడేనా, అసలు మానవుడేనా  లేక మరేదైనానా????

"రాజు గారి కుండలో
నేను కాకుంటే వేరొకరిన పాలు  పోస్తారులే” అనుకుంటే
 మిగిలేది నీటి కుండ 
లేదా 
అసలు ఏమి పోయకుంటే ఒట్టి కుండ 
మరి 
నేను ఒక్కడినేనా ప్రకృతి నాశనానికి కారణం అనుకుంటే 
అందరితో పాటు కింద పడటానికి సిద్ధపడు!!!! 
మరి నరికే కొమ్మ మీద నీవు ఉన్నావుగా 

సరిగ్గా 
చూడు ఆ కొమ్మల్ని నరికిన ప్రతి గొడ్డలి పైన 
పేర్లు ఉన్నాయి ఎవరు పట్టుకున్నారో 

నరికావో నరకమన్నవో
నరుకుతుంటే చూసి ఆనందించావో 
ఎవరికి తెలుసు

ఇంటి కప్పు తీసేసి 
ఇంటిలోకి దూరిన ఇంటి దొంగలు
ఇంటిని గుల్ల చేసారంటూ భోరుమంటే ఎలా???? 

తల్లినే వివస్త్రని చేసి 
ఆ తల్లి రొమ్ము చీల్చి 
తల్లి మాంసాలని అమ్మేసి 

ఇవాళ తల్లి పాలు లేవు అంటే 
ఎక్కడ నించి ఇస్తుంది నీకు ఆ తల్లి?????

పక్కింటోడు పబ్బులకి, క్లబ్బులకీ వెళ్ళాడని 
నువ్వూ వెళ్తే పోయేది నీ సొత్తే, నీ ఆరోగ్యమే

ముందు నీవు జాగర్తపడే 
 మార్గం చూడు 

వివస్త్రై తల్లడిల్లుతున్న ఆ తల్లికి 
పచ్చని తోటల పూలవనాలతో వస్త్రాలని తొడుగు 
భవితని నిలిపే
ఆశయాలు, కలలు నిండిన
 నీ రాజ్యపు రంగులను 
టెక్నాలజీ సిమెంట్ నించి ప్రకృతికి మార్చు 

ప్రపంచాన్ని బ్రతికించాలని 
తాహత ఉందో లేదో కూడా 
సరిగ్గా నీకే తెలియని ఓ పండితుడా 
ముందు నీ అంతరంగాన్ని పరిశీలించుకో 
అంతరాత్మని  బ్రతికించుకో 

తాను ఏమి చేయకనే ఏదో చేశా అని 
రేపటి రోజున అది బాధ పడిందో 
నీ నిర్మాణాల, యంత్రాల నిప్పుకణాలు  అక్కర్లేదు 
అది చాలు చిచ్చు పెట్టకుండానే దాహించేయటానికి 

మేలుకో 
పట్టుకున్న గ్రహణానివైనానని 
పరితపించే కొడుకువి ఐననాడు 
గ్రహణం విడిపించే శాంతి మంత్రం నీవే అవగలవు 
మేలుకో!!!!!!! 


No comments:

Post a Comment