Monday, November 28, 2011

ఆధునికతా ఇరువురికీ కాదా???

పరువు బరువు ఒకరి భుజాల పైనే ఎందుకు???





 










ఇదేమి
న్యాయం....
పరువు ఇరువురికీ ప్రాణం అయినపుడు...
బరువు ఒకరి భుజాల పైనే ఎందుకు???

స్వేచ్ఛ కావాలి , పద్ధతులు మారాలి అంటావు...
పాశ్చాత్య సంస్కృతి అలవరచుకోవాలి అంటావు ....

తెల్ల వారిలా ఉండాలి అంటావు...
మనసులో నలుపు పులుముకుంటావు....

వారి పోకడలు కావాలంటావు...
మరీ...
స్వేచ్ఛలో ఉన్న సమానత్వం
యేల నీకు కాన రాదు???

నీవు చేస్తే ఆధునికత నేర్చానంటావు....
సంస్కృతిలో ప్రగతికి పాటు పడుతున్నా అంటావు...
అదే స్త్రీ చేస్తే బరి తెగించింది అంటావు...
సంస్కృతిని కాల రాస్తుంది అంటావు....

ఆధునికతకై విదేశాలలో బ్రతకమని పంపిస్తావు...
ఆధునిక వివాహాలను ఒప్పుకోలేవు...
పరువు గంగలో కలిసినదంటావు...
స్త్రీ అని ఆలోచించక అంతం చేస్తావు...

గంగ కూడా అందరిని సమానంగా చూస్తుంది...
తానూ ఒక స్త్రీ అయినా అన్ని పాపాలను మోస్తుంది....
కాని నీవే ఒకలా ఉండవు....
వ్యత్యాసం చూపిస్తావు...

నీవు చేస్తే కృష్ణ లీలలు...
తాను చేస్తే వేశ్య పోకడలు....
ఇదేమి విచిత్రం....తప్పు ఎవరు చేసినా తప్పే కదా???
మరి తప్పు నీకు హక్కు ఎలా ఔతుంది...

నీవు చేస్తే మగవాడేలే అని అంటున్నవారు ...
ఆమె చేస్తే పొగరుబోతు తనం అంటారే???
ఇదెక్కడి ధర్మం ,న్యాయం
ఇరువురికీ ఒకటే న్యాయం ఉండదా????

నీ స్త్రీని తల్లిలా గౌరవించాలి అంటావు...
పరస్త్రీని మాత్రం కామిస్తావు...
నీకు లేని భావం వేరొకరికి ఎక్కడిది...
నీవు కోరే సంస్కృతినే కాదా వారూ కోరేది...

సోదరా....
నీవు ముందుకు నడువు...
అందరితో కలసి ఆలోచించు...

రెండు భిన్న సాంప్రదాయాలను
ఒకే చోట కలిపి ఉంచలేవు

నీవు ఆశించే సమాజం నుంచే
నీ సహజీవనం లభిస్తుంది...

సమాజం లోనిదే సహజీవనం మిత్రమా ...
రెండు సంప్రదాయాలు ఒక సమాజంలో
ఒకే ఒర లోని రెండు కత్తులు లాంటివి...
అది ఎప్పటికీ కలసి ఉండలేవు...

సోదరా...
ఇదేమి న్యాయం....
పరువు ఇరువురికీ ప్రాణం అయినపుడు...
బరువు ఒకరి భుజాలపైనే ఎందుకు???

2 comments:

  1. నీ స్త్రీని తల్లిలా గౌరవించాలి అంటావు...
    పరస్త్రీని మాత్రం కామిస్తావు...
    నీకు లేని భావం వేరొకరికి ఎక్కడిది...
    నీవు కోరే సంస్కృతినే కాదా వారు కోరేది...
    అమోఘం చాల చక్కగా ఉంది ........ నేటి సమాజంలో స్త్రీ అన్నిటిలో సమానమైయినప్పటికినీ ఈ పురుషాధిక్య సమజంలో నలిగిపోతున్నది .. ఇది చాల విచారకరం

    ReplyDelete
  2. నిజానికి ఆచారమేమిటి, కట్టుబాట్లేమిటి, ధర్మమేమిటి, సమాజమేమిటి అనే విషయాలు మనిషిని మంచి మార్గం లో నడిపించడానికే నా దృష్టిలో 'మనిషి' అంటే ఆడ మగ ఇద్దరినీ సంభొదిoచే పదం కాని ఈనాటి ఈ సమాజం రెండు కులాలుగా చూస్తుంది ఆడ కులం, మగ కులం, ఆడ మనిషి, మగ మనిషి అలాగే వారి వారి ప్రవర్తనలు కూడా వొకరు(మగ) చేస్తే న్యాయం, మరొకరు(స్త్రీ) చేస్తే అన్యాయం, తప్పు , ప్రస్తుతం నడుస్తున్న ధర్మం ఇది ఆచారం ఇది వ్యవహారం ఇది.....ఇది మారాలంటే స్త్రీ మాత్రమె మార్చాలి (భారతీయ నారివి నువ్వు నీ రక్తంలో సీత వుంది , నీ కర్మలలో గీత వుంది,హర్షడువార్గాలననిచే ఆది శేక్తివి నీవే) ఈ జగతి రీతులు మారాలంటే స్త్రీ అనుభావిచే పురిటినొప్పులు మగవాడు అనుభవించినప్పుడు, స్త్రీ నవమాసలలో సగం బరువు మగవాడు మోసినప్పుడు, స్త్రీ తనలోని సహనం ఓర్పు ,ఓపిక, ఓదార్పు మగవాడు సగం అన్భూతి చెందినప్పుడు, స్త్రీ మనస్త్వతం ఆవలింప జేసుకున్నపుడు, .....స్త్రీ పూర్తిగా మగవాన్ని పట్టించుకోనప్పుడు,...స్త్రీ మూర్తి లేని ప్రపంచం రుచిచూపిచినప్పుడు తప్పకుoడా మార్పు వచ్చే అవకాశం మాత్రమె వుంది నా దృష్టి లో ....
    నిజంగా చెప్పాలంటే ప్రతి మనిషి జీవితం ఒకే ఒక పదం తో ముడిపడి వుంది ఆ పదం పేరే "రాజి" దీనికి ఉదాహరణ ఈ రోజుల్లో జరిగే ఎడబాటుదనం(విడాకులు) , నా అనుభవంలో నేను చూసింది ఏమిటంటే మాది ప్రేమ వివాహం అని చెప్తుంటారు, వారి అభిరుచు భిన్నాలు, వారి వారి అభిప్రాయులు భిన్నాలు, కాని నా దృష్టిలో ప్రేమ అనేది పెదాల పైన మాత్రమె కాని వివాహం అనేది మాత్రం ఒక సాకు ఈ రోజుల్లో ప్రేమకు నేనిచ్చే నిర్వచనం సందు దొరికితే చెట్టు చాటు తీసు వెళ్ళే ప్రేమలు అసలు విషయం ఏమిటంటే శ్లోకా శాస్త్రి గారు అద్భుతంగా వివరించారు వేదాల లో శాస్త్రాల లో చెప్పినవన్నీ వినడానికి అద్భుతాలు కాని అనుభవం లో మాత్రం భిన్నాలు, వేదాలు శాస్త్రాలలో వున్నా వాటిని నిజంగా మానస వాచా పాటిస్తే మనిషి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది అలాగే శ్రీరామచెంద్రుని సుగుణాలు, శ్రీ కృష్ణుని ధర్మపథం మగవానిలో అదే విధంగా ఆడ వారి లో సీత్తమ్మవారు,సతీసావిత్రి లోని సుగుణాలు కలిగి ఉన్నప్పుడే తరాజు లో తూకం సమంగా వుంటుంది కష్ట సుఖాలలో సమముగా నడచిన జెన్మ తరించును , అందుకే మన పెళ్ళిళ్ళలో ఒక అద్బుత గట్టం ఉంటుది ఎడ్ల బండి ఖాని ని వధువు తలపై మోపి వేద మంత్రాలు చదువుతారు దాని అర్థం ఇదే ......
    చివరికి నేను చెప్పేది స్త్రీ ఎప్పటివరకు పతి భక్తీ లో సావిత్రి లా వుంటుందో,సీత లా ఓర్పు సహనం కలిగి వుంటుందో,తన కర్మలలో గీతను పాటిస్తుందో అప్పటి వరకు ఈ సమాజం మారదు మగవాని ప్రవర్తనలో మార్పు రాదు ...... అలాగని మన శాస్త్రాలను ధర్మాలను తప్పు పట్టడం కాదు అందులోని రాముని తత్వం కృష్ణుని భొదలు ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి సనాతన ధర్మాన్ని పాటించాలి ....స్త్రీలు స్త్రీ ధర్మాన్నిఇప్పటికి పాటిస్తున్నారు ఎక్కువ శాతం , కాని ఎక్కువ శాతం పురుషులు మాత్రమె కాస్త అదుపు తప్ప్యారేమో అనిపిస్తుంది వీరిరువురు తరాజు లో సమానముగా తూగినప్పుడు ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవని నా అభిప్రాయం సమాజం లో స్త్రీ పాత్ర ఎంత గొప్పది పురుష పాత్ర కూడా అంటే గొప్పది అయినా తండ్రి లేని లోటు తల్లి తీర్చ గలదు కాని తల్లి లేని లోటు ప్రపంచంలో ఎవ్వరు తీర్చ లేరు ఇది జీవిత సత్యం అందరు ఒప్పుకొని తీరాల్సిందే ..............జ్ఞానం అనే త్రాసు లో తూకం వేసి చూడండి అంతా మనకే భోధ పడుతుంది .....

    ReplyDelete