జాతి జాతి అంటావు....
మానవతే లేనప్పుడు ఏ జాతి నీవు!!!!
నీతి నీతి అంటావు....
నీ చేతలలో అంతా అవినీతి నింపావు!!!
కులము కులము అని అరిచేవు....
గుణము మరచి బ్రతికేవు!!!
అన్నిటిలో నిశ్వార్ధం ఆశిస్తావు....
కాని నీవే స్వార్థంతో నిండిపోయావు!!!
అందరినుంచి గురవం పొందాలి అనుకుంటావు....
నీకే చేతకానిది ఆశించటం అత్యాశ అని తెలుసుకోలేవు!!!
నీ పరువు ప్రతిష్టలు పదిలంగా ఉండాలనుకుంటావు....
కాని ప్రక్కనవాడివి శిధిలం చేయాలనీ చూస్తావు!!!
సమాజం సరిగ్గా ఉండాలి అంటావు...
నీవు సమాజంలో భాగం అని మరిచేవు!!!
నేను సైతం అనుకోలేనప్పుడు....
ఇంకెక్కడి నీతి నిజాయతి...
ఇంకెక్కడి నిష్కల్మష అభిమానం...
ఇంకేమి సమాన నవసమాజం...!!!!!
మిత్రమా ముందు నీవు మేలుకో...
అప్పుడు సమాజాన్ని మేలుకొలుపు!!!!!
Shloka (శ్లోకా శాస్త్రి)
చాలా బావుంది.ఆలోచనాత్మకంగా ఉంది.ఇంకా ఎన్నో మంచి కవితలు రాయాలని కోరుకుంటూ...
ReplyDelete" భగవంతుడు ఈ సృష్టిని సృష్టిస్తే మానవుడు హద్దులు నిర్మించాడు " ఈ కులమతాలు అనేటివి నిజంగా నవ సమాజంలో ఒక దౌర్భాగ్యమే...
ReplyDeleteACHELIE gaaru
ReplyDeleteసమానత్వం పేరు చెప్తూనే మానవత్వంలో చిచ్చు పెట్టేవి ఈ కుల మత జాతి భేదాలే
మీ స్పందనకి ధన్యవాదాలు