Saturday, February 11, 2012

సృష్టిని నేను.... నీ మనుగడని

సృష్టిని నేను.... నీ మనుగడని...
అలక్ష్యం చేయకు నా మౌనాని ...

నేను క్షణమైనా ఆగని కాలాన్ని...
ఏ అలసట తెలియని పయనాన్ని...
ఎన్నో అనుభావ చిత్రాలని దాటి
ముందుకు సాగిపోతున్న సెలయేటిని...
విషాద వినోదాలను ఒకేలా
స్వీకరించే నిర్లిప్త గమనాన్ని...
అంతరంగాలలో బడబాగ్ని దాగినా...
అంతటా నేనే నిండిన అందాల రాశిని
ఆణువణువూ ఆశ్చర్యపరిచే అతిశయాన్ని
ఇంకా ఎవరికి అర్థం కాని చిక్కు ప్రశ్నని


నేడు నిలువునా దహించి వేస్తున్నా....
స్వార్థం స్వైరవిహారం చేస్తున్నా....
మౌనంగా చూస్తున్నాను ఎందుకంటే.......

నా కోపం ప్రళయ తాండవం...
నా కన్నీరు ముంచేసే తూఫాను...
నా ఆవేశం ఉప్పొంగే సుడిగుండం ...

నా సహన రేఖ చెదరి పోతే,
ఈ భావం కట్టలు తెగితే,
నీకే జరుగును అనర్థం...
ఇంక మిగిలేది అంతా అంధకారం...

ఆ తరువాత విలపించినా 
ప్రతిఫలంగా మిగిలెను పరితాపం...
అయినా ఆగదు నా పయనం...
వేచి చూడను ఎవరి కోసం!!!!

Shloka( శ్లోకా శాస్త్రి)

No comments:

Post a Comment