Sunday, May 20, 2012

అమ్మ

ఇలలో తొలి గురువు... "అమ్మ"
మాటలు నేర్వగానేతొలి పలుకు... "అమ్మ"
మనసుని చేరే తొలి లాలి పాడేది "అమ్మ"
మనిషి కొనలేని గొప్ప సంపద మమత అని తెలిపేది "అమ్మ"
స్నేహం మాధుర్యం పరిచయం చేసే తొలి నేస్తం... "అమ్మ"
తన ప్రపంచం అంటే మనమే అనుకునే ఏకైక ప్రాణి .... "అమ్మ"
మన ఊసులని మెచ్చి, తొలి శ్రోత, అభిమాని ... "అమ్మ"
నా చిన్ని చిన్ని కానుకలకి సైతం మురిసే పసిపాప "అమ్మ"
అక్షరమాలలో ఆది అక్షరానికి పలుకు చిహ్నం "అమ్మ"
సత్యమేదో, అసత్యమేదో తెలిపే వివేకం "అమ్మ"
ఎంత వేదనైనా తనలోనే దాచుకుని...
నిన్ను, నీ గెలుపుని చూసి ఆనందిచేది "అమ్మ"
నీ మంచిని కోరే మొదటి మనసు, మనిషి "అమ్మ"
సృష్టికి ప్రతిరూపం, ఆ బ్రహ్మకే పరబ్రహ్మ "అమ్మ"
"అమ్మ"కి అర్థం పరమార్థం అమ్మ మాత్రమే!!!

2 comments:

  1. చక్కని అక్షర రూపం ఇచ్చారు. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది!

    ReplyDelete
  2. ధన్యవాదములు రసజ్ఞ గారు.
    నిజమే అండి. "అమ్మ" అంటేనే అంతులేని ప్రేమ సాగరం . ఆ సాగరంలోని అమృతం ఎంత తాగిన తనివి తీరదు

    ReplyDelete