Thursday, September 26, 2013

నీవు పలకని భావాలు

నీవు పలకని యెన్నో భావాలు
నీ కనులు నాతొ పంచుకుంటున్నాయి

నీ మౌన రాగాలకి
నీ నవ్వులు పల్లవిస్తున్నాయి

నీవు రాయని కావ్యాలకి
నీ నీలి ముంగురులు రాగాలు ఆలపిస్తున్నాయి

నీ నడకల తాళానికి
నీ వాలు జడ నాట్యం చేస్తున్నది

మౌనంగా నీ వెంట నడిచే నీడ చెప్తోంది
నేను నీలొనే నిండి ఉన్నానని
నీవు నన్నే తలచుకుంటున్నావని

No comments:

Post a Comment