మనుసు పలికే భావం నువ్వు...
మాటల నడుమ మౌనం నువ్వు...
కనులలో తొలి కిరణం నువ్వు...
కవులకందని కావ్యం నువ్వు.....
మాటల నడుమ మౌనం నువ్వు...
కనులలో తొలి కిరణం నువ్వు...
కవులకందని కావ్యం నువ్వు.....
అమ్మ కడుపులో వెచ్చదనం నువ్వు....
ఆవు పాల తీయదనం నువ్వు....
పైరగాలి చల్లదనం నువ్వు...
చెలియ కౌగిలిలో మధురానుభూతి నువ్వు....
అమ్మ చేతి గోరుముద్ద నువ్వు...
ఎడబాటులో విరహం నువ్వు....
కవ్వించే కోరిక నువ్వు....
కలిగే ప్రతి స్పందన నువ్వు....
ఎడబాటులో విరహం నువ్వు....
కవ్వించే కోరిక నువ్వు....
కలిగే ప్రతి స్పందన నువ్వు....
గుండె లోతులోని ఆశలు నువ్వు....
గుండె గూటిలో జ్ఞాపకం నువ్వు....
గుండెను పిండే వేదన నువ్వు....
గుండె గాయానికి వైద్యం నువ్వు...
విడదీయలేని చిక్కు నువ్వు....
జవాబు లేని ప్రసన నువ్వు....
అర్థం కాని పొడుపు నువ్వు....
"అంత నువ్వే" అనిపిస్తావు...
జవాబు లేని ప్రసన నువ్వు....
అర్థం కాని పొడుపు నువ్వు....
"అంత నువ్వే" అనిపిస్తావు...
ఆనందాల ఝడిలో తడిపేస్తావు...
అంతలోనే విషాదం నింపేస్తావు...
నేన్నునానంటు చేరువ వస్తావు.....
చివరకి ఒంటరిని చేస్తావు....
ప్రేమ ఎందుకే.....
మనసుతో ఆటలాడేవు....
గుండెను ముక్కలు చేసేవు...
జీవితాన్ని సమాధి చేసేవు....
శూన్యం మిగిల్చి వెళ్ళేవు????????????
Shloka (శ్లోకా శాస్త్రి)
No comments:
Post a Comment