Monday, December 5, 2011

తెలుపుకన్నా చందమామే బాగుంది...

                     
                                 ఒక ఊర్లో ఒక పేద అమ్మాయి ఉండేది. అమ్మాయి చాలా నల్లగా ఉండేది.కాని అమ్మాయికి అది తెలియదు ఎందుకంటే అమ్మాయికి అద్దం అంటే కూడా తెలియనంత అమాయకురాలు.అందరు తనని  "నల్ల పిల్లా" అంటుంటే అదే తన పేరు అనుకుంది. రోజు పగలంతా ఊర్లో పని చేసి రాత్రి పూట చందమాతోనే మాట్లాడుకునేది. తనకి ఎవరు స్నేహితులు కూడా లేరు. తను చేసిన పనులు, తన ఆశలు, కోరికలు అన్ని చందమామతోనే చెప్పేది.
                        
ఒక రోజు అనుకోకుండా ఒక చోట తను అద్దంలో తనని తాను చూసుకుంది. అది తనే అని, తన రూపం అలా ఉంటుందని తెలిసాక చాలా దిగులు పడింది. ఏమి మాట్లాడకుండా ముభావంగా ఉండేది. అప్పుడు ఒక రోజు చందమామ  వచ్చి " ఏమైంది? ఎందుకు అల ఉన్నావు? నాతో మాట్లాడటం మానేసావు ఎందుకు?" అని అడిగాడు.
                        
అందుకు అమ్మాయి," నేను చూడు ఎంత నల్లగా ఉన్నానో? నీలా నేను కూడా తెల్లగా అవ్వలేనా?" అని అంటుంది.అప్పుడు చంద్రుడు," నల్లగా ఉంటే ఏంటి నీ మనసు మంచిది కదా?" అంటే, "నీవు కూడా నాలా నల్లగా ఉంటే తెలుస్తుంది నా బాధ" అంటుంది.
                       
కాసేపు అలోచించి చంద్రుడు," సరే నీ నలుపు నేను తీసుకుంట  నా తెలుపు నీకు ఇస్తా, సరేనా?" అని చెప్పి అమ్మాయిని తెల్లగా చేసి తను నల్లగా అయిపోతాడు. అమ్మాయి రాత్రి అంతా తన అందం చూసుకొని మురిసిపోతూ చాలా సంతోషంగా పడుకుంటుంది. కాని సంతోషం మరుసటి రోజు రాత్రికే మాయం అయిపోతుంది, రోజు కనిపించే తన నేస్తం, తాను ఇంత అందంగా కనిపించతంకి కారణం ఐన చంద్రుడు కనిపించలేదు అని దిగులు మొదలయింది . అప్పుడు చంద్రుడు వచ్చి, "మళ్ళి ఏమైంది?" అని అడుగుతాడు. అప్పుడు అమ్మాయి," నీ తెలుపు నువ్వే తీస్కో." అని అంటుంది.
                        
అప్పుడు చంద్రుడు ,"ఎందుకు ?" అని అడుగుతాడు. అందుకు అమ్మాయీ "తెలుపుకన్న నువ్వే బాగున్నావు." అంటుంది.. "అదేంటి" అని చంద్రుడు అడిగితే, " నీ తెలుపు నాకు ఇచ్చక నువ్ నాకు కనపడటం మానేసావు. అందువల్ల నేను నీతో మాట్లాడలేక పోయాను. నిన్ను చూడలేక పోయాను. నాకోసం నువ్వు అందరికి దూరం ఐయావు. నాకు అది ఇష్టం లేదు.నాకు తెలుపు కన్నా ఎప్పుడు నాతో మాట్లాడే నీ స్నేహమే కావాలి. తెలుపు కన్నా నీ  స్నేహమే గొప్పది. అందుకే నాకు తెలుపు వద్దు." అంటుంది.
     
                   అందుకు చంద్రుడు చిన్నగా నవ్వి, " నీ తెలుపు ఏమి ఇవ్వకర లేదు. నీ మంచితనానికి తెలుపుని  నీకు బహుమతిగా ఇస్తున్నానుమనం ఇద్దరం తెల్లగానే ఉంటాము. నువ్వు అందం కన్నా  స్నేహం గొప్పది అని తెలుసుకున్నావు కదా అదే చాలు" అని చెప్తాడు. అప్పుడు నుంచి తను నల్లగా ఉన్నాను అని మరచిపోయి తనకోసం ఏమైనా చేసే గొప్ప స్నేహితుడు ఉన్నాడు అని అమ్మాయి చాల ఆనదంగా హాయిగా ఉంది.

నీతి  : "అందం కన్నా మంచితనం చూసే స్నేహమే మిన్న."

రచన: శ్లోకా శాస్త్రి.            

2 comments:

  1. కథను చక్కగా narrate చేశారు

    ReplyDelete
  2. your blog is very aesthetic and appealing sloka and ur feels are sensitive nice to see you...congrats ..lots of love urs j

    ReplyDelete