Wednesday, December 7, 2011

నీ నీడనై తోడునై నీతోనే ఉండిపోనీ నా ప్రాణమా!!!

                           ప్రియా....
                          
నీ గాయానికి నేను ఔషధం అవుతాను...
                          
నీ బాధకి నేను సాంత్వనం అవుతాను...
                          
నీ కన్నీటికి నీ ఓదార్పు అవుతాను....
                          
నీ బాటలో నేను చుక్కాని అవుతాను
....
                          
నీ గుండె మంటలకు నేను చన్నీళ్ళు అవుతాను...

        నా ప్రేమ పల్లకీ లోనికి ఒక్కసారి అధిరోహించవా...
       
నీ జీవితానికి నన్ను వెలుగు ప్రసరించనీయవా ....
       
నీ దీపపు కాంతికి నన్ను చమురుగా రానీయవా....
      
నీ నుదుటన కుకుమ రేఖనై వెలిగిపోనీయవా....
      
నీ నీడనై తోడునై నీతోనే ఉండిపోనీ నా ప్రాణమా!!!!!!!!
                                               Shloka (శ్లోకా శాస్త్రి)

No comments:

Post a Comment