నాలుకపై కొలువు చేసెను ఒకరు...
హృదయమే కొలువు చేసెను ఒకరు...
తనువులో సగ భాగం ఇచెను ఒకరు...
ఆది పరాశక్తి అని కొలిచేను అందరు....
వారిని పూజిస్తాము...
కోరికలు తీర్చమని ఆరాధిస్తాము...
వారి నామాలను పిల్లలకి పెడతాము....
కాని ఆ రూపాల్లో ఉన్నది ఆడవారే ఐన
నిజ జీవితంలో గౌరవిన్చాలేవు
నీ పుస్తకం సరస్వతి అంటావు..
నీ జీవిత పుస్తకం లో మాత్రం...
కనీసం ఒక పుటము( పేజి) లో
కాకుంటే ఒక పంక్తు( లైన్) లో
స్మరించటంకి మనసు రాలేదు!!!
భార్య తల్లిలా చూడాలి అంటావు....
కాని తల్లి తో సమానంగా ప్రేమించాలేవు ఎందుకు????
పైగా తనని జీవిత భాగం చేస్తానని
కన్యాశుల్కం మొదలుపెట్టావు...
నీ వ్యాపార చతుర్యాని ప్రదర్సిన్చావు...
సమాజంలో నీ ఆదిపత్యాన్ని సృష్టించావు...
కన్యాశుల్కాన్ని వరకట్నంగా మార్చావు
ప్రతి సారి బంధాన్ని వ్యాపారంగానే చూసావు
తనని ఇంటికి మాత్రమె పరిమితం చేసావు…
నీ అవసరాలు తీర్చుకోవటం కోసం
తనకి విద్య నేర్పి సంపాదనకి పంపావు
తన స్వశక్తి ని ఇస్తున్న అంటూనే
తన శక్తీని దోచుకున్తునావు..
అన్నిటిలో పెళ్లిని లాభసాటి వ్యాపారంగా చూసావు....
అడుగడుగునా స్వలాభం చూసుకున్నావు...
వేదాలు చెప్పని ధర్మాన్ని సైతం
వేదాలు ఘోషిస్తునాయి అని మరీ
మగువలపైన రుద్దుతున్నావు...
ఇదేమి న్యాయం... ఇదేమి ధర్మం...
మానవ జాతి మనుగడకు
మూల కేంద్రం ఐన మగువకు...
ఇంత అలక్ష్యమా....
ఇదేనా మీరు ఇచే బహుమానం??????
Shloka (శ్లోకా శాస్త్రి)

No comments:
Post a Comment