Wednesday, December 7, 2011

ప్రేమిస్తావా?

                   అనురాగం పంచే అమ్మ లాలనలా
                  
అభిమానం పెంచే నాన్న ఆప్యాయతలా
                  
అన్నింటా ఆదరించే అన్న అండదండలా
                  
మారగాదర్శిలా ఉండే అక్క స్ఫూర్తిలా
                  
కష్టాలలో వెన్ను తట్టి నడిపించే నేస్తంలా
                  
తప్పులను సరిదిద్దే గురుదేవుని సూచనలా
 
 
 
 
 
అన్నిటిని తనలోనే చూపించి
శ్రవణ మేఘంలా అల్లుకుపోయి....
మనసావాచా కర్మణా అన్ని వేళలా
కడవరకు తోడు ఉండే చేలికానిలా
నన్ను ప్రేమిస్తావా????
Shloka (శ్లోకా శాస్త్రి)

No comments:

Post a Comment