Tuesday, December 13, 2011

నా మర మనిషికి మనసు రోధనతో పని లేదు.


తెల్లారింది లేగండోయే అని కోడి ఎప్పుడో లేపింది....
ఇంకా మొదలైంది మరమనిషి జీవితం...ఉరుకులు పరుగులతో కాలానికి పోటిగా...
ఉన్న రెండు చేతులనే నలుబది రెండు చేతుల్లా వాడుతూ....

ఏమైంది నాకు వేళ.... పనులు మధ్యలో ఆలోచనల గోల ఏంటి???
బహుశ నిన్న అమ్మమ్మ వాళ ఇంటికి వెళ్ళినందుకు ఏమో.

అమ్మమని చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. కోడి కూయక ముందే (ఇప్పుడు అక్కడ కుక్కలు అర్తుస్తున్నాయిలెండి ) లేచి లంకంత ఇంటిని ఒక్కత్తే సర్దుకుని, తుడుచుకుని అందరికి (స్కూల్ కి , కాలేజీకి , ఆఫీసుకి) లంచ్ బాక్స్ తయారు చేస్తుంది.
కాసేపు ప్రశాంతంగా కూర్చుని మనసైన ఫిల్టర్ కాఫీ తాగే కాసేపే  ఆవిడ కుదురుగా  కూర్చునేది. ఇంకా మళ్లీ మర మనిషి పని మొదలవుతుంది.
అన్ని ముగించే అప్పటికి అందరు తిరిగి వచేస్తారు. మళ్లీ ఏమైనా చేసిపెట్టి, రాత్రి భోజనాలు ముగించి అన్ని సర్దుకునే అప్పటికి ఆవిడకి రోజు మార్తున్నాను పడుకో అని క్యాలెండరు గుర్తు చేస్తుంటుంది. అయినా ఆవిడలో నిరాశా, శూన్యం ఎప్పుడు కనిపించలేదు నాకు.అసలు వయసులో కూడా ఆవిడ ఏనాడు అలసట గురించి ఆలోచించలేదు, ఒకవేళ మనం అడిగితే ఒక చిన్న నవ్వు నవ్వి సంతృప్తి ఇచ్చే పని అలసటని ఎవ్వదురా చిట్టితల్లి అని చెప్తుంది.
నా మనసు అదుగో అప్పుడు మొదలు పెట్టింది గోల( ఆలోచనల తుఫాను దాన్నిని ముంచేస్తుంటే అది మాత్రం ఏమి చేస్తుందిలెండి). అది అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేక దాని రోధానని సమాధి చేయాలనీ నెత్తి  మీద ఉన్నవి లేనివి పనులు పెట్టుకున్నాను, మిక్సి మోతలో దానిని మర్చి పోవాలనుకున్నాను  అయినా మనసు ఆపుతుందా వెనకాలే వచ్చి చెవుల్లో రొద పెడ్తోంది.
ఇంతకి దాని గోల ఏంటి అంటే "నువ్ అమ్మమల ఎందుకు ప్రశాంతంగా ఉండటం లేదు. నీకు ఎన్నో ఉన్నాయి కదా సౌకర్యాలు ఐన ఎందుకు ఏదో అసంతృప్తి ?" కాని దీనిని సమాధాన పరచాలి అంటే చాలా కష్టపడాలి కదా? నేటి (మొండి వాడు రాజు కంటే బలవంతుడు కాని మనసు ముందు బలాదూర్ కదా) ఇంకా మొదలైంది నాలో అంతర్మధన. అసలే సమయం లేదు అంటే దీనికి ఇప్పుఉద్ నచ్చ చెప్పటం ఇంకా సమయం పడ్తుందే అని కాల చక్రం కన్నా వేగంగా ఎన్నో ఆలోచనలు తిరగటం మొదలైయాయి.
అయ్యో రామ దీనికి ఎలా చెప్పగలను అమ్మమ దగ్గర ఉన్నదీ నా దగ్గర లేనిదీ ఒకటి నన్ను అశాంతికి గురి చేస్తోందని. నాటి జీవిత భ్రమణంలో అంత యన్త్రికమే అని, బంధంలోను అనుబంధం పంచుకునే ముందే(పంచుకునే అవకాసం లేకుండా) , నేటి కాలంలో  కాలం వెనుక పరిగెత్తే పోటిలో కాలి పోతోంది అని, ఒకే గొడుగు కింద ఇద్దరు బాటసారుల్లా ఉన్నది నేటి సహజీవనం అని. ఇక్కడ ఇప్పుడు అంతా నీవల్ల నాకేంటి లాభం, నీకు అది ఇస్తే నాకేమి ఇస్తావ్ అనే వ్యాపారంతో సాగుతోంది జీవితం అని ఎలా చెప్తే అర్థం అవ్తుంది. ఇక్కడ ఇప్పుడు డబ్బులు పంచుకోవటానికి ఉన్న సమయం భావాలు పంచుకోవటానికి, చివరకి దీని గోల, రోదన వినటానికి  కూడా సమయం లేదు ఎవరికి. వారి వారి కోరికలు తీర్చుకోవటానికి కోరికలే ఆశయాలు(నిజంగా ఆశయాలు కానివి. సినిమాలు చూడటం, నిద్ర పోవటం కూడా కొందరికి ఆశయమే అలంటి వారి గురించి చెప్తున్నా, నేను ఇలాంటి వారిని చూసే చెప్తున్నాను సుమా) అనుకుని భ్రమ పడటానికి మాత్రం సమయం ఉంటుంది అని  దీనికి ఎలా నచ్చ చెప్పను. నేటి కాలంలో పంచుకునేందుకు ఏమి లేవు పంచుకునే మనుషులు కూడా లేరు అని దీనికి ఎలా చెప్తే అర్థం అవుతుంది.
అసలు ప్రశ్నలు ఎందుకే  హైయిగా ఉండక అంటే వినదుకదా. చెప్పిన సమాధానం అర్థం చేసుకుని సంతృప్తిగా పడుకోదు పడుకోనివ్వదు కదా. కాని చెప్పినా ఒప్పుకోదు? చెప్పిన మాట వింటే అది మనసే కాదు కదా? కాని అదే చిన్నగా అర్థం చేసుకుంటుందిలే అని వదిలేసి పడుకున్న. అదుగో మళ్లీ మొదలు ఐయ్యింది దీని అరణ్య రోదన. ఇది ఆపదు నేను, నచ్చ చెప్పే ప్రయత్నం చేయను. ఎప్పటికి దొరుకుతుందో మా ఇద్దరి సమస్యసకి సమాధానం... ఇంకేప్పటికి అర్థం అవుతుందో దానికి నా సమాధానం,  నాకు దాని ప్రశ్న.
 "
నాలోని నా మనసుకే నా భాష అర్థం  కాలేదు ఇంక అందరికి అర్థం కాలేదని బాధ పడటం ఎందుకు?" అని నేను మాత్రం నిర్ణయానికి వచ్చేసి నా మర మనిషిని ముందుకి సాగించేస్తున్నా.

Shloka (
శ్లోకా శాస్త్రి)

4 comments:

  1. అమ్మమ దగ్గర ఉన్నదీ నా దగ్గర లేనిదీ ఒకటి నన్ను అశాంతికి గురి చేస్తోందని. ఈ నాటి జీవిత భ్రమణంలో అంత యన్త్రికమే అని, ఏ బంధంలోను అనుబంధం పంచుకునే ముందే(పంచుకునే అవకాసం లేకుండా) , నేటి కాలంలో కాలం వెనుక పరిగెత్తే పోటిలో కాలి పోతోంది అని, ఒకే గొడుగు కింద ఇద్దరు బాటసారుల్లా ఉన్నది నేటి సహజీవనం అని. ఇక్కడ ఇప్పుడు అంతా నీవల్ల నాకేంటి లాభం, నీకు అది ఇస్తే నాకేమి ఇస్తావ్ అనే వ్యాపారంతో సాగుతోంది జీవితం అని ఎలా చెప్తే అర్థం అవ్తుంది. ఇక్కడ ఇప్పుడు డబ్బులు పంచుకోవటానికి ఉన్న సమయం భావాలు పంచుకోవటానికి, చివరకి దీని గోల, రోదన వినటానికి కూడా సమయం లేదు ఎవరికి.

    శ్లోక నిజ్జం చెప్పావు.
    నీ కవితలే కాదు మనసు గురించి కూడా ఎంతో చక్కగా రాసావు.
    ఇక మీదట ఇలాంటివి ఎన్నో రాయాలని కోరుకుంటూ...

    ReplyDelete
  2. nitya jeevitamlo aa maramanushule lekunte jeevulu jeevinchaleru. anduke kondaru maramanushulu. Nutakki Ragghavendra Rao.(Kanakambaram)

    ReplyDelete
  3. thanks thatha gaaru.... mee amoolyamaina sandheshaniki... chala santhosham andi

    ReplyDelete
  4. శైలు థాంక్స్ రా

    మరమనిషి వెనకాల ఇంకా చావలేక బ్రతకలేక ఒక మనసు మూల్గుతోంది అని చెప్పే చిన్న ప్రయత్నం రా.... అంతే...

    ReplyDelete