Tuesday, January 10, 2012

వృద్ధాశ్రమాలపై ఆలోచన వద్దు !!!

                    అమ్మ నిజం... నాన్న నమ్మకం

                      " నిజం" కష్టమైనా నిలకడగా ఉండటం నేర్పుతుంది

                       ఎప్పుడు నీ వెన్నంటి ఉంటుంది....
                       నమ్మకం ముందుకు వెళ్ళటానికి
                       ధైర్యాన్ని, చేయూతని ఇస్తుంది....
                       నిజాన్ని, నమ్మకాని వెన్నంటి ఉంచుకుంటేనే
                      జీవితంలో విలువలు తెలుస్తాయి

         నీ జీవిత పయనంలోని ప్రతి అడుగులో...
        తన కష్టాన్ని, ఆనందాన్ని, మధురమైన క్షణాలని
        నీ బంగారు భవిష్య నిర్మాణం కోసం త్యజించిన
        "నిజ నమ్మకాలు" అయిన తల్లిదండ్రులను మరువకు...
        పై పైన మోజులతో పైశాచికంగా మారకు....

                      కట్టెలో కలిసే వరకు నీ గురించే ఆలోచించే
                      ఈ ప్రేమామృత భండాన్ని వృద్ధాశ్రమంలో బంధించకు
                     ఈ అమూల్య వరాన్ని నీ పోకడలతో బాధించకు
                     వారి ఋణం తీర్చి కృతజ్ఞత చూపక పోయిన బాధపడరు కాని
                    ఈ వయసులో నీ అతితెలివితో కృతఘ్నత చూపి
                    ఈ పెద్దతనంలో ఆ నిరుపేద హృదయాన్ని వృద్ధాశ్రమాలలో శిధిలం చేయకు

         రేపు నీ సంతతి నిన్నే ఆదర్శంగా తీసుకుని
         నీ దారినే నడచి వచ్చి నీవు నేర్పిన విద్య చూపిస్తే
         నిన్ను కూడా వృద్ధాశ్రమంలో వదిలేస్తే?????
         తన తల్లితండ్రులను పూజంచని వారి తనయులు
         తల్లిదండ్రులను పూజించుట గురించి ఎటుల నేర్చెదరు????
         ఒక్క సారి ఊహించుకుంటేనే గుండె జారిపోతుందే...
        మరి వారికీ మనసు ఎంత నరక వేదన అనుభవించి ఉంటుందో కదా ???

                       అందుకే తొలి అడుగు నీవే వేయాలి...
                       మార్పుకి పునాది నీవే కావాలి...
                       వృద్ధాశ్రమాలపై ఆలోచన మనసులోనుంచి తుడిచివేయాలి !!!



  Say No To Old age Homes

No comments:

Post a Comment