Thursday, December 1, 2011

పెళ్ళి......


   
  పెళ్ళి......                మూడు ముళ్ళు....  ఏడు అడుగులు...
                  
వేద మంత్రాలు... మంగళ వాద్యాలు...
                 
తలంబ్రాలు... సన్నికల్లు.... అరుంధతి దర్శనం...
                 
బంధు మిత్ర ఆశీర్వాదాలు... విందు భోజనాలు...  
ఇదేనా పెళ్లి అంటే???ఇదేన  దీని అర్థం పరమార్థం???
కాదు నేస్తమా!!!
పెళ్ళి అంటే.....
               
రెండు మనసులు ఒకటిగా కలసి....
               
విభిన్న అలవాట్లను...  భిన్న సాంప్రదాయాన్ని....
              
భిన్న వ్యక్తిత్వాలని...   భిన్న ఆలోచనలని...
              
స్వాభిమానాన్ని మరచి....
 
రెండు కుటుంబాలను
 
ఒకటిగా ఉంచటానికి చేసీ ఒక యాగం...
 
రెండు ఆత్మలను కలిపి ఉంచే పవిత్ర బంధం...
 
అది కలతలు లేకుండా చూసుకోవటం ఒక తపస్సు!!!
 
పెళ్ళి నూరేళ్ళ పంట కావాలి కాని...
 
ఒక్కరికి కూడా కాకూడదు గుండెల్లో మంట

               Shloka (శ్లోకా శాస్త్రి)

No comments:

Post a Comment