Tuesday, January 10, 2012

ఏం తెలుస్తోంది మనిషిని చూస్తే???



మొక్కలని చూస్తే తెలుస్తుంది; మంచి పంచటంలో ఆనందం ఏంటో ...
బంతిని చూస్తే తెలుస్తుంది; ఓడిపోతే మళ్ళీ గెలుపుకోసం పోరాడటంలో గర్వం ఏంటో...
కెరటాలను చూస్తే తెలుస్తుంది ;అనుక్షణం లక్ష్యం కోసం తపించటంలో ఉత్సాహం ఏంటో...
పక్షిని చూస్తే తెలుస్తుంది; అందరాని తీరాలను అందుకోవటంలో అభిలాష ఏంటో...
మూగ జీవాలని చూస్తే తెలుస్తుంది; ప్రేమించేవారిపైన విశ్వాసం చూపటంలో తృప్తి ఏంటో....

మరి మనిషిని చూస్తే ఏం తెలుస్తుంది ???

మానవత్వం ఎంతగా నశించిందనా???
స్వార్థం ఎంతగా ప్రజ్వలిస్తోందనా???
క్రూరత్వానికి పట్టాభిషేకం జరుగుతోందనా???

No comments:

Post a Comment