భోగి మంటలు గత కాలపు వ్యర్థం లాంటి ...
మధించే చేదు అనుభవాలను...
కాల్చేసి ముందుకు సాగిపోమ్మనే సంకేతం!!!
చలి లాంటి ఒంటరితనం నుంచి....
బయటకి పిలిచే వెచ్చని స్నేహ హస్తం...
తప్పక ఉంటుందనే నమ్మిక చిహ్నం!!!!
మకరసంక్రమణంతో రైతుకు కొత్త వెలుగు పంచుతూ....
ఇన్నాళ్ళ కష్టానికి ఫలితం అందుకోమనే సూచనే సంక్రాంతి ...
రైతు ఆనందంతో పుడమితల్లికి జరిపే వేడుక ఇది!!!
ఈ వేడుకకి తన వంతు సహకారం ఇచ్చేది ముగ్గు....
లక్ష్మి కటాక్షానికి తన లోగిలి సిద్ధం అంటూ గొబ్బెమ్మలు....
బంతుల మాలలు, చెరుకు గడలు , పాల కుండలు!!!
హరి దాసు దీవెనలే శుభసూచకాలు....
సమాజంలో చైతన్యం పెంచే బుర్రకథలు....
అలరించే సాంప్రదాయ పడుచుల అందాలు!!!
ఎంతటి కష్టానికైనా సై అనే ధైర్యాని పెంచే పందెపు కోళ్ళు... ఆకాశమే హద్దు అని చెప్పే గాలి పటాలు ....
పుడమితల్లికి తొలి నివేదనగా చెక్కెర పొంగళ్ళు....
దేవుడి ఊరేగింపుతో అలరించే రథాలు!!!
రైతన్న గొప్పతనానికి దేశం ఇచ్చే సత్కారం...
అతని కష్టంతోనే మనకి భుక్తి లభిస్తుందని...
రైతు మనసు తియ్యదనమే మనభోజనంలో నిండి ఉందని ...
గుర్తుచేసే అతి గొప్ప పండుగ సంక్రాంతి!!!!
చాలా బావుంది శ్లోకా
ReplyDeleteసంక్రాంతి శుభాకాంక్షలు.
shailu thank u so much ra
ReplyDeleteనీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు