Tuesday, January 10, 2012

క్షమించు తల్లి... నేను తెలుసుకోలేక పోయాను



నీ కడుపున పడిన వేళ
దొరికెను నా వరము మరలా...
చూచెదను లోకంలోని హేల
అన్నిటిని కళ్లారా అని భ్రమసితిని....
అణువైనా ఎదగాకముందే మీలా

జీవం ఎదిగేకోద్ధి ఎందుకో నాలో
ఎన్నెన్ని చింతలో చికాకులో
ఇంకా చీకటిలో ఎన్నాళ్ళో
కాని ఇక్కడే తెలిసిపోతోంది నీ సడిలో
బయట ఉన్నదే తప్పించలేని సంకెళ్ళని

అవయవాలు ఎదిగేకొద్ది అవసరాలు పెరిగాయి
నా అవసరం తీర్చటానికి నీకు నప్పనివి
నాకు శ్రేయమైనవి ఎన్నో చేసావు...
క్షమించుతల్లి బందీ చేసావని భ్రమపడ్డాను
కాని కవచా కుండలం అని తెలుసుకున్నాను

కాళ్ళు చేతులు ఎదగగానే
తిరుగుళ్ళపై ఆలోచనలు...
నా చుట్టూ అల్లుకున్నవి స్పర్శించాలని
నా వెచ్చని లోకం అంతా చూడాలని
తొందరలో ... నిన్ను ఇబ్బంది పెట్టాను

మలినాల్లో కొట్టుమిత్తడుతున్నపుడు
పూర్వజన్మ సవరించలేకున్నాను...
జన్మనైన సరిగ్గా ఉండవలేననుకున్నా
కాని కలి నీళ్ళు చల్లగానే అన్ని మరచి
జన్మకి అన్కితమైయాను,
నీ త్యాగం మరచిపోయాను .... నన్ను క్షమించు తల్లి...

బయటకి రావాలి అనే ఆరాటంలో
లోకాన్ని చూడాలనే ఆవేశంలో
నీకు భరించలేని బాధ కలిగించాను
పునర్జన్మనే తలపించాను తల్లి మన్నించు...

కాని నేడే తెలిసెను తల్లి
నీలోనే నేను సురక్షితమని...
నీ గర్భాలయంలోనికి రావటానికి
నేను క్షణమైనా మరణిస్తాను తల్లి
                  
 

No comments:

Post a Comment