బ్రతుకు బడిలో జీవితాన్ని చదువుతున్నాను....
కలల ఒడిలో కన్నీటిని దాచుకుంటున్నాను....
కలతపడినా, కలవరించినా నాకోసం రారేవ్వరు....
పుట్టిన నాడు ఒంటరినే... పోయే అప్పుడు ఒంటరినే...
అందుకేనేమో బ్రతుకంతా నాకు ఒంటరితనమే తోడు...
కాని జీవితాన్ని అనుభవంతో నేర్చిన చిన్నారిని....
దేనికి తలవోగ్గని పోరాటపటిమ ఉన్నదానిని....
రేపు మీకే జీవితాన్ని నేర్పించగల ధీశాలిని....
నా జీవితాన నేనే ఝాన్సీ రాణిని!!!!

thank u Mahender garu
ReplyDelete