వేకువలా ఎదిగాను నిన్ను చేరాలని
వెన్నెలలా విరిసాను నిన్ను పొందాలని
నీడనై జనియించాను నీతోనే సాగాలని
పూవునై పూచాను నిన్ను మురిపించాలని
లతలా నిన్ను అల్లుకున్నాను నన్ను మరవాలని
హరివిల్లునై విరిశాను నిన్ను అలరించాలని
నేనే నీవైయ్యాను నిన్ను మరిపించాలని
ఇకనైనా నాపైన దయ రాదా ప్రియా
నీలోని నన్ను నీవే గుర్తించవేల ప్రాణమా
శ్లోకా శాస్త్రి

థాంక్స్ మహేందర్. నీవు ఇచ్చే ఈ మనోధైర్యానికి చాల చాల సంతోషం నేస్తమా
ReplyDelete