ఓ తల్లీ.... నాటి అనుభావల సంగ్రహమా...
నీ సంతతికి ప్రాణప్రదమైనావమ్మా ...
కొడుకైన కూతురైన ఒకటే అని పెంచావమ్మ....
మరి అత్తగా మారగానే మనసు
మారేనేన్దుకమ్మా ....
కోడలు నీ కూతురువంటిదని మరిచితివమ్మా...
నీ ఇంటికి వచ్చిన పరదేశ బానిస కాదమ్మా....
నిన్ను ఆదరించ వచ్చిన కొత్త నేస్తమమ్మ...
దీపం పైన ఆధిపత్యం కోసం...
నిరంతర ఆదాయం కోసం ఆరాట పడతావు ఎందుకమ్మా...
తల్లీ...... కోడలు అనే దీపంలో ప్రేమ అనే చమురు పోస్తే
ప్రేమ అనే వెలుగు ఇల్లంతా ప్రసరించుతుంది....
నీ కూతురులా కాకున్నా సాటి మనిషిలా
నీకు వాటిల్లిన నష్టంలా చూడకు...
జీవితం వ్యాపారం కాదు తల్లీ...
లాభనష్టాలను కొలవటానికి...
నీవు ఒకనాటి కూతురువి, మొన్న కోడలివి
నేడు అతవి... కాని ఎప్పుడు తల్లివేనమ్మా...
ఓ సోదరి...నేటి తరం నారీ శిరోమణి...
తల్లిని పూజించావు...
నీ మరో ప్రాణం అన్నావు...
మరి అత్తని ఎందుకు ద్వేషిస్తావు...
మితిమీరిన ఆంత్రం( APPENDIX ) అనుకుంటావు ...
పుట్టినింట కాలచక్రంలా కష్టపడటం
బానిసత్వం కానపుడు...
ఇక్కడ అదే బానిసత్వం ఎందుకైనది...
నీ కుటుంబం ఎందుకు కాకున్నది...
చెల్లీ... నిన్నటి చెలివి, నేటి ఆలివి...
రేపటి తల్లివి... కాని అన్నివేళలా...
మనసున్న మగువవే ...
అనురాగ కల్పవల్లివే...
ఓ స్త్రీ.... అనురాగ పరిపూర్ణిత...
బంధం మారగానే
అనుబంధంలో కూడా మార్పు రావాల???
నీవు పడిన వేదన
నీ తర్వాత కూడా కొనసాగాలా?
మనసు ముసుగు చాటున...
మరో రూపం ఎందుకు....????
ఓ స్త్రీ.... మనసు ముసుగు వెనక మరో రూపం ఎందుకు???
అనురాగం లో వెత్యాసం ఎందుకు????
shloka (శ్లోకా శాస్త్రి)
అనురాగం లో వెత్యాసం ఎందుకు????
shloka (శ్లోకా శాస్త్రి)
No comments:
Post a Comment