నా హృదయం ఒక సముద్రం...
నీ ప్రేమే దానికి తీరం...
కలల అలలతో చేస్తున్న ప్రయాణం....
కావాలని ఎప్పటికైనా నీలో ఏకం...
నిత్యం కలిసే ఉన్నా...
ఎప్పటికి కలవలేని ప్రేమ జంట మనం...
మరచి పోనివ్వని విశ్వ విన్యాసం...
మౌనంలోనూ.... కెరటాల అలజడిలోనూ ....
వినిపిస్తుంది నా హృదయ ఘోష...
ఉప్పొంగే ఆశల నిట్టూర్పుల నా శ్వాస...
ఓడిపోతున్నా ఆగని పంతం...
వదులుకోలేని నిత్య ప్రయాసం...
అంతే తెలియని మనాసులో అల్లకల్లోలం...
ఏనాటికి వింటుందో నీ హృదయం...
ఎప్పటికి ఆగున ఈ ప్రయాణం...
ఎప్పుడు చేరున అది గమ్యం....
నిదురలోనూ, మెలకువలోనూ కలసి ఉన్నా ...
కలువలేని వింత ప్రఘాడ దూరము....
ఎప్పుడు ఆగునో చెలరేగు సుడిగుండము!!!!!
shloka (శ్లోకా శాస్త్రి)
No comments:
Post a Comment