Thursday, December 1, 2011

ఈనాటి పతి పరమేశ్వరుడు కాగలడ???


తల్లిని పూజిస్తావు, ప్రేమిస్తావు,సేవిస్తావు ...
కాని ఆలికి చేయూత ఇవ్వటానికి నిరాకరిస్తావు...
ఎందుకంటే...
తల్లి దగర నీకు కుమారుడవి....
కాని...
ఆలి చెంత పరిపూర్ణ 'మగాడివి'...

              స్నేహానికి ప్రాణం ఇస్తావు...
              ఆనందంగా సహకరిస్తావు...
              నీతో నూరేళ్ళు జీవించాల్సిన
              భార్యకి సహకరించేందుకు ఆలోచిస్తావు...
               ఎందుకంటే...
              అక్కడ నీవు నేస్తానివి....
              ఇక్కడ నీవు సంపూర్ణ 'మ'గాడివి ....

ఆడది అబల అంటావు...
కాని అన్నిటికి ఆ అబలే కావలి...
నీవు చేస్తే అలసిపోతావు...
మరి అబల ఎవరు "బలుడా"????

              నీవు చేస్తే ఏ పైని ఐన అది గొప్ప....
              వనిత చేస్తే మాత్రం ఇంతేగా అంటావు...
              మరి ఇంతే అయినపుడు
              నీవెందుకు చేయవు కొంతైనా ఓ 'మగసిరీ'????

"Woman"....
మాగాడి తోనే ఆడది ఉంటుంది అంటావు...
కాని....
ఆడదానిలోనే మగాడు ఉంటాడు
మరి ఎవరి హృదయం విశాలమైనది???
అని తెలుసుకోలేవు...
ఎందుకంటే నీవు పతి'దేవుడు' కదా...

              సున్నితం, సుకుమారం అంటావు...
              ఎంత బాధ ఐన సహించగలదు...
              మరి ఎవరి మనసు గట్టిది "శిలా హృదయమా"????

రూపవతి,గుణవతి, శీలవతి, అనుకూలవతి
అన్ని ఉన్న వనితని కోరుతావు....
కానీ నీలో ??? ఏమి అఖర లేదు..
ఎందుకంటే...
నీవు అన్నిటి
నిమించి "మగా"డివి....

              పతి పరమేశ్వరుడు అంటారు....
              కాని ఆ ఈశ్వరిని తనలో కలుపుకున్నాకే
              పరేమేస్వరుడు అయినాడు...
మరి...
నీవు ఈశ్వరుడువా….. పరమేశ్వరుడువా...???
ఈ పతి పరమేశ్వరుడు కాగలడా???


 
shloka (శ్లోకా శాస్త్రీ)                
                

No comments:

Post a Comment