నేడే తెలిసెను ప్రియా....
చిరునవ్వు కూడా బాధిస్తుందని...
ఆకాశం అంచున నీవు కనిపిస్తావు.....
నా కోసం వేచి ఉన్నావు అనిపిస్తావు...
కలల రాణి ఎదురైంది అనుకున్నాను....
నిన్ను చేరాలని పయనమైయ్యాను...
నీ చిరునవ్వే నా బలం అనుకున్నాను...
ఆ నవ్వులను స్పర్శించాలి అనుకున్నాను....
అంతలో నిజం తెలిసెను ప్రియా....
మనసు కనులున్నా చూడలేనిదని ...
నీవు అందని జాబిల్లివని....
నా ప్రయాణం అంతు తెలియనిదని....
నీ చిరునవ్వుల మాయలో నన్ను మరిచానని...
నీకై నీవు నన్ను చేరరావు అని....
నేడే తెలిసెను ప్రియా.....
చిరునవ్వు కూడా బాధిస్తుందని.....
shloka (శ్లోకా శాస్త్రి)
No comments:
Post a Comment