Thursday, December 1, 2011

జీవిత పయనంలో నవరస సూత్రాలు


మనసు( mind )
             మంచి మార్గాని చూపే గురువు.....
             ఆసలకు నిరంతర ప్రాణవాయువు....
             నిన్ను నీకు చూపే దర్పణము....
             తప్పుని విమర్శించే తొలి హేతువు....

పట్టుదల( persistence )
             ఏ పని చేయటానికైనా మేలుకొలుపు....
             లక్ష్య సాధనకి ఆయువుపట్టు...
             గెలుపై ఆశను మదిలో నిర్భంధ పెట్టు....
             నెగ్గటమే తెలిసిన పూచీపట్టు....

ఆత్మ విశ్వాసం  (confidence)
             జీవిత రణరంగంలో బ్రహ్మాస్త్రం...
             పందెంలో గెలుపుకి ముఖ్య ఆయుధం....
             అలసిన మనసుకి ఆశను పెంచే సాధనం....
             పోరాడే మనసు కోరే కవచకుండలం...

గౌరవం (respect )
             ఆశించటం తేలిక కానీ ఇవ్వటం కష్టం...
             ఇచ్చే కొద్దీ పెంచుతుంది మనపై ఇష్టం...
             మంచిని మాత్రమె చూపే దీపము....
             ఆధిపత్యం కోసం వాడితే అవహేళణము....

స్వేచ్చ( freedom )
            ఇవ్వకపోతే ఆరాటము, ఇస్తే ఆవేశము...
            ఆనందం అనిపించే భావము....
            నిర్ణయాన్ని అమలు చేసే అవకాసము...
            అపసవ్య దిశలో పోకుంటే అందము...

అనుకూలత (Grace )
             ఎదుటివారి నుంచి  మనం ఆశించేది....
             ఎదుటివారికి ఇవ్వటానికి ఆలోచించేది....
             ప్రతి విషయంలో కావలసినది....
             మనసులలో ప్రశాంతత నింపేది....

ఆశ( hope )
            నేర్చుకోవటానికి, ముందుకు సాగటానికి....
            ఎదగటానికి.... లక్ష్యాన్ని నిర్ణయించటానికి....
            గెలవటానికి... గమ్యాన్ని చేరటానికి....
            అవకాశానికి మార్గాన్ని వెతికే శక్తీనిచ్చేది...

భాద్యత ( accountability )
          మనది ఒకరు భరిస్తే నచ్చేది....
          మనకి ఇస్తే బరువు అనిపించేది...
          ఇవ్వనపుడు అవమానం అనిపించేది...
          ఇచ్చాక నిలబెట్టుకోవటం కష్టమైనది....

కుటుంబం(family)
            విశ్వాసం నిండిన మందిరం...
            అది ఆవిరైతే అంత శిధిలం....
            నావాళ్ళు ఉన్నారు అనిపిస్తుంది....
            బంధానికి విలువ పెంచుతుంది....

సమపాళలో ఉన్నపుడే అన్ని రసాలు....
పంచుకోగాలము జీవితాలు....
శ్రుతి తప్పితే రాగాలు....
కలుగును మనుగడలో లోపాలు!!!!
Shloka (శ్లోకా శాస్త్రి)

No comments:

Post a Comment